గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక అంశంపై చర్చ

by Vemula.Srinu Prasad |

అమరావతి సచివాలయంలో గనుల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు...

గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక అంశంపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి సచివాలయం(maravati Secretariat)లో గనుల శాఖ(Mines Department)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై చర్చించారు. ఈ సమీక్షంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు పాల్గొన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా రూ.3320 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34 శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి‌పైగా అదనపు ఆదాయం వస్తుందని సీఎం చంద్రబాబుకు అధికారులు స్పష్టం చేశారు.

Next Story