- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరో నూతన ఒరవడి.. వాట్సాప్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు
రాష్ట్రంలో మరో నూతన ఒరవడికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో నూతన ఒరవడికి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. గతంలో 500 సేవలకు వాట్సాప్ ద్వారా పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని పెంచింది. వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance) ద్వారా మొత్తం 700 ప్రభుత్వ సేవల(Government services)కు పరిష్కారం చూపేందుకు అధికారులు సర్వ సిద్ధం చేశారు. ఈ 700 సేవలను ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నారు.
జీఎస్‌డీపీపై సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన జీవన ప్రమాణాలు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలని, అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళిక విభాగం డ్రైవ్ చేయాలని చెప్పారు. ఆగస్ట్ 15నుంచి ఆన్‌లైన్‌లో 700 ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.






