Cm Chandrababu: ప్లీజ్ మేడమ్.. నిధులు కేటాయించండి..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు..

Cm Chandrababu: ప్లీజ్ మేడమ్.. నిధులు కేటాయించండి..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Central Minister Nirmala Sitharaman)ను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కోరారు. ఢిల్లీ(Delhi)లో పర్యటిస్తున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకు సాస్కి, పూర్వోదయ స్కీం తరహాలో ఏపీకి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను నిర్మల సీతారామన్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

Next Story