- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశీ విద్యపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
చదువు కోవాలని అనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు....

దిశ, వెబ్ డెస్క్: చదువు కోవాలని అనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) హామీ ఇచ్చారు. జ్యూరిచ్(Zurich) తెలుగు డయాస్పోరా(Telugu Diaspora) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి యూనివర్శిటీలు ఎక్కడున్నా విద్యార్థులకు అవకాశాలు అందేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. 4 శాతం వడ్డీతో రుణాలు ఇప్పించి విదేశీ విద్య అందించేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తామని తెలిపారు. ఏపీ ఫస్ట్ అనే అతి పెద్ద రీసెర్చ్ వ్యవస్థను తెస్తున్నామని, ఐఐటీ–ఐఐఎస్‌ఈఆర్ కాంబినేషన్‌తో ఈ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో స్థాపిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
యువతకు ఉపాధి చూపించేలా..
‘‘కొత్త ఆవిష్కరణలతో యువతకు ఉపాధి చూపించేలా కృషి చేస్తున్నాం. 2047 నాటికి దేశం అగ్రభాగాన నిలుస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్–1 కావాలి.. తెలుగు జాతి వెలగాలి. 30 ఏళ్లకు ముందు భారత దేశం గురించి ప్రత్యేకంగా చర్చించుకునే వారు కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఇందులో ఏపీ ప్రజలు భాగస్వాములు కావాలి.’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.






