నెల రోజుల్లో 4 మెడికల్ కాలేజీల పనులు: అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు..

నెల రోజుల్లో 4 మెడికల్ కాలేజీల పనులు: అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: పీపీపీ(PPP) విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల(Medical Colleges) పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని అధికారులను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story