- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిపై చర్యలు తీసుకోండి: డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం
పొదిలిలో మహిళలు, పోలీసులపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు..

దిశ, వెబ్ డెస్క్: పొదిలి(Podili)లో మహిళలు, పోలీసులపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీ(DGP)ని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. పొదిలి ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు శాంతి భద్రతల సమస్యల సృష్టిస్తారా అంటూ మాజీ సీఎం జగన్ (Former Cm Jagan Mohan Reddy)మోహన్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. కాగా మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. అమరావతి రైతులు, మహిళల(Amaravati Women, farmers)ను కిందచపర్చేలా సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు, మహిళలు, రాష్ట్రవాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి చైర్ పర్సన్, జగన్ సతీమణి భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే పొదిలి జగన్ పర్యటన నేపథ్యంలోనూ నిరసన వ్యక్తం చేశారు. పొదిలి మెయిర్ రోడ్డు సెంటర్‌లో జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్దులు ప్రదర్శించారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. రైతులు, మహిళలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు మహిళతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నాయకులపై వ్యతిరేక వ్యక్తమవుతోంది. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రైతుల పరామర్శ పేరుతో వెళ్లి ఈ అరాచకాలు ఏంటని ప్రశ్నించారు. రైతుల కోసం వెళ్లి జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు అని నిలదీశారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే, దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా?, దుర్వినియోగం చేస్తారా? అని మండిపడ్డారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta)ని ఆదేశించారు.






