సెక్రటరీలపై సీఎం చంద్రబాబు సీరియస్... ఢిల్లీ వెళ్లి డబ్బులు తీసుకురావాలని ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-12 12:33:54  IST  )

మార్చి నాటికి అందరూ హస్తనకు పోయి నాలుగు డబ్బులు తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు

సెక్రటరీలపై సీఎం చంద్రబాబు సీరియస్... ఢిల్లీ వెళ్లి డబ్బులు తీసుకురావాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: మార్చి నాటికి అందరూ హస్తనకు పోయి నాలుగు డబ్బులు తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఆదేశించారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో మంత్రులు, హెచ్ వోడీలు, సెక్రటరీతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేంద్ర పథకాల నిధులెందుకు వినియోగించడంలేదని మండిపడ్డారు. ఈ నెల 15వరకూ గడువు ఉన్నా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. కేంద్రం నిధులు వాడుకోకపోతే ఆ సొమ్ము మురిగిపోతుందని, ఆ హక్కు మీకెవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.
అలా ఎందుకు చేస్తున్నారు

మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి కేంద్రం డబ్బుల తీసుకొస్తారని ఎదురు చూస్తున్నామని, కానీ ఇలా ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలా అయితే వారానికి ఓసారి పెడతానన్నారు. మంత్రులు, హెచ్‌వోడీలు, సెక్రటరీలు ఆలోచించాలన్నారు. సాంఘిక, గిరిజన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న డబ్బులు ఖర్చుపెట్టకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డబ్బులన్నీ ఈ నెలాఖరులోపే ఖర్చు చేయాలని, ఆ తర్వాత తామే స్వయంగా వెంటపడతామని హెచ్చరించారు. అన్ని శాఖల కంటే ఆర్థిక శాఖ ఇప్పుడు బాగా పని చేస్తోందన్నారు. ఈ నెలాఖరు కేంద్రపథకాల నగదు ఖర్చు చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story