- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నియామక పత్రాల అందజేతకు ముహూర్తం ఖరారు
ఏపీలో మరో వినూత్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో వినూత్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable candidates)కు స్వయంగా తన చేతులు మీదుగా నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. 6వేల మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 16న నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 వేల మంది కానిస్టేబుళ్లను భర్తీ చేసింది. నియమాక పత్రాలు అందజేసేందుకు తాజాగా కసరత్తులు ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబ సభ్యులు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే హోంమంత్రి అనిత, జిల్లా పోలీస్ అధికారులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
ఇక నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లకు డిసెంబర్ 22 నుంచి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమాన్నిసైతం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 16నే ప్రారంభంకానుంది. మొత్తం 9 నెలలపాటు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తారు. రెండు విడుతల్లో ట్రైనింగ్ పూర్తి చేశారు. తొలుత నాలుగున్నర నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత వారం పాటు సెలవులు ఇస్తారు. అనంతరం మరో నాలుగున్నర నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత పోస్టింగులు ఇవ్వనున్నారు.






