- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుట్రలను తిప్పి కొట్టండి: పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం
కుట్రలను తిప్పి కొట్టండని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు...

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో అసత్య ప్రచారాలు వైరల్‌గా మారాయి. ప్రధానంగా మద్యం వ్యవహారంలో ప్రభుత్వంపై వైసీపీ(Ycp) నేతలు విమర్శలు చేస్తూ ఏదో సంఘటనను వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక సూచనలు చేశారు. మంగళగిరి టీడీపీ(Tdp) కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలు కూడా జగన్ కుట్రలపై సమాంతరంగా పని చేయాలని సూచించారు. పార్టీ కోసం తప్పదని, తమకెందుకులే అనుకోవద్దన్నారు. జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. మద్యం కేసు విషయంలో సిట్ విచారణ కొనసాగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని జోగి రమేశ్ అంశంపై పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు.






