- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIPB భేటీలో కీలక నిర్ణయం..లోకేశ్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో ఆయన (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్‌తో పాటు మంత్రులు టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, సుభాశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించారు.
ఈ భేటీలో వివిధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో పోర్టల్ ఏర్పాటు చేయాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే ఉత్పత్తి మొదలు పెడితేనే లక్ష్యం చేరినట్లవుతుందని తెలిపారు. ఐటీ సంస్థలకు నామ మాత్రపు ధరకే భూ కేటాయింపులు ఉంటాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పెట్టుబడుల సాధన కనిపించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






