- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దుష్టులు మళ్లీ వద్దు.. వస్తే అన్నీ పీకేస్తారు: సీఎం చంద్రబాబు
ఆ దుష్టులు మళ్లీ వస్తే అన్నీ పీకేస్తారని, అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: ఆ దుష్టులు మళ్లీ వస్తే అన్నీ పీకేస్తారని, అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు పథకం ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. 16 నెలల క్రితం వరకూ పరదాలు కట్టుకుని, గోతులు తవ్వారని, ప్రజల్ని భయంలో ఉంచారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, పేదల సంక్షేమంలోనూ డబ్బులు బొక్కేసిన వాళ్లు రాజకీయానికి పనికిరారన్నారు. ఇలాంటి దుష్టశక్తులు రాకుండా, ప్రజలకు చెడు జరక్కుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదే మనకు ఈ దసరా, దీపావళి పండుగల పాఠాలు అని, మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం, సుపరిపాలను కేవలం 16 నెలల్లోనే తెచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘మన సంస్కృతిలో భాగమైన పండుగల్ని అంతే ఉత్సాహంతో చేసుకోవాలి. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధ సాధ్యం. కేంద్రం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో అందరికీ ఉచిత ఆరోగ్య భీమా కల్పించాం. 25 లక్షల వరకూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతాయి.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.






