ఎమ్మెల్యే చదలవాడపై సీఎం చంద్రబాబు సీరియస్.. వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఎమెల్యే చదలవాడ అరవింద్ బాబుపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు...

ఎమ్మెల్యే చదలవాడపై సీఎం చంద్రబాబు సీరియస్.. వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమెల్యే చదలవాడ అరవింద్ బాబు(MLA Chadalawada Arvind Babu)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. విజయవాడ ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయం(Vijayawada Excise Commissionerate Office)లో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

కాగా ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలంటూ ఎమ్మెల్యే చదలవాడ గురువారం హల్ చల్ చేశారు. కమిషనర్ వచ్చే వరకూ ఛాంబర్‌లోనే బైఠాయించారు. మూడు గంటలపాటు హడావుడి చేశారు. ఆయన వచ్చి మాట్లాడినప్పటికీ కూడా చదలవాడ వినిపించులేదు. వైసీపీ హయాంలో నియమించిన 10 మంది కాంటాక్టు ఉద్యోగులను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. వెంటనే వారిని తొలగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఈ వార్తా కథనాలు పత్రికలు, మీడియా చానళ్లలో ప్రసారం అయ్యాయి. దీంతో ఈ విషయంపై చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ మేరకు ఆరా తీశారు. వెంటనే వివరణ ఇవ్వాలని చదలవాడ అరవింద్‌బాబుకు ఆదేశాలు జారీ చేశారు. తప్పని సరిగా చదలవాడ అరవింద్‌ బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను, కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ఆదేశించారు. చందలవాడ వివరణ ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తామని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో చదలవాడ అరవింద్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆయన అనుచరులు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.

Next Story