- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌వి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు
సింగరేణి కంపెనీలో భారీగా అవినీతికి తెరలేపి రూ.1600 కోట్ల బొగ్గు కుంభకోణం చేశారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ,వెల్గటూర్: సింగరేణి కంపెనీలో భారీగా అవినీతికి తెరలేపి రూ.1600 కోట్ల బొగ్గు కుంభకోణం చేశారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమస్యల నుంచి దాట వేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని అదే ఆయన నైజమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రూ.1600 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు.
కేటీఆర్ బొగ్గు కుంభకోణం పై కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసే బదులు ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్‌కు సహకరిస్తున్న బిజెపి ప్రభుత్వంతో విచారణ చేయించమని మంత్రి అడ్లూరి సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోతుందని మంత్రి అన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి కేటీఆర్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తిప్పికొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడం, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఆస్తుల పంపకాల్లో చెలరేగిన గొడవల నేపథ్యంలో ఏం చేయాలో తెలియని కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు.






