అన్ని పూర్తి చేస్తా.. మార్కాపురం జిల్లాకు సీఎం వరాలు

by Vemula.Srinu Prasad |

ఇచ్చిన మాట ప్రకారం అన్ని పూర్తి చేస్తానని మార్కాపురం జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు...

అన్ని పూర్తి చేస్తా.. మార్కాపురం జిల్లాకు సీఎం వరాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇచ్చిన మాట ప్రకారం అన్ని పూర్తి చేస్తానని మార్కాపురం జిల్లా(Markapuram District) ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా గంటావానిపల్లె(Gantavanipalle)లో వెలింగొండ ఫీడర్ కెనాల్ పనుల(Velingonda Feeder Canal Works)కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా తాను సవాల్‌గా స్వీకరిస్తున్నానని చెప్పారు. అన్ని పనులు పూర్తి చేసి ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తెస్తానని తెలిపారు. నదుల అనుసంధానం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోదావరి నుంచి 6 టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని చంద్రబాబు తెలిపారు. వెలిగొండకు కావాల్సింది 53 టీఎంసీలేనని చెప్పారు. మార్కాపురంలో ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని, రక్షిత మంచినీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story