దేవాన్ష్ ప్రపంచ రికార్డు... పట్టలేనంత ఆనందంలో లోకేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-14 10:36:05  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించారు...

దేవాన్ష్ ప్రపంచ రికార్డు... పట్టలేనంత ఆనందంలో లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) మనవడు, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తనయుడు దేవాన్ష్(Devansh) ప్రపంచ రికార్డు సాధించారు. చెక్‌మేట్ సాల్వర్-175లో దేవాన్స్ వేగవంతంగా పజిల్స్ సాధించారు. దీంతో వరల్డ్ రికార్డును దక్కించుకున్నారు. లండన్‌ వెస్ట్ మినిస్టర్ హాలులో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకల్లో దేవాన్ష్‌కు ఈ అవార్డును నిర్వాహకులు ప్రధానం చేశారు. గత ఏడాదిలో ఈ అవార్డును దక్కించుకోగా.. ఇదే డొమైన్‌లో మరో రెండు రికార్డులను సైతం దేవాన్ష్ సొంతం చేసుకున్నారు.

అయితే దేవాన్స్ ఈ ఘనత సాధించడం పట్ల తండ్రి నారా లోకేశ్ స్పందించారు. తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. 10 ఏళ్ల వయసులోనే దేవాన్స్ ఆలోచనలకు పదును పెట్టారని తెలిపారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా, అంకిత భావంతో దేవాన్స్ చెస్ నేర్చుకున్నారని చెప్పారు. దేవాన్స్ గంటల తరబడి చేసే కఠోర శ్రమను తండ్రిగా తాను స్వయంగా చూశానని తెలిపారు. దేవాన్స్ చేసిన శ్రమకు, కష్టానికి తగ్గ ఫలితం లభించడం చాలా సంతోషంగా ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Next Story