Cm Chandrababu: చీరాల చేనేతలకు కీలక హామీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-07 08:40:09  IST  )

చీరాల చేనేతలకు సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు....

Cm Chandrababu: చీరాల చేనేతలకు కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్ : చీరాల(Chirala) చేనేత(Handlooms)లకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. తమ సమస్యలపై చీరాల పట్టణంలో చేనేతలు చేపట్టిన నిరసనపై ఆయన స్పందించారు. చీరాల చేనేతలందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 50 సంవత్సరాల వయసుకే చేనేతలకు పెన్షన్ ఇవ్వాలని మొదటిసారిగా నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. చేనేతల పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని, వివర్ శాల అనే ఓ వినూత్న మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చేనేతలకు ఎప్పుడూ అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నెల నుంచి చేతి మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే జీఎస్టీని 5 శాతం తగ్గిస్తామని, దీనికి రూ. 15 కోట్లు ఖర్చవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Next Story