మామిడి రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు... రూ. 260 కోట్ల నిధులు విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-18 13:54:58  IST  )

తోతాపురి మామిడి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు...

మామిడి రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు... రూ. 260 కోట్ల నిధులు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) మాట నిలబెట్టుకున్నారు. మామిడి రైతుల(Mamidi Farmers) సమస్యను పరిష్కరిస్తామని కుప్పం పర్యటన(Kuppam Tour)లో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అడుగులు వేశారు. మామిడి రైతుల పరిష్కారానికి రూ.260 కోట్ల నిధులను విడుదల చేశారు. రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు కేటాయించాలని ఆదేశించారు. దీంతో మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు లబ్ధిచేకూరనుంది. సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ అకౌంట్లను పరిశీలించుకోవాలని చెప్పారు. అయితే రూ. 260 కోట్లు MIS విధానంపై పూర్తి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వ్యవశాయ శాఖ తెలిపింది. తోతాపురి మామిడి కాయల కొనుగోళ్లు ఆగస్టు 2025 వరకు కొనసాగించాలని, ప్రాసెసర్లు రూ.8, రూ.12 మద్దతు ధర ఇవ్వాలని కోరింది

Next Story