ఎంఎస్ఎంఈ రంగంపై సీఎం చంద్రబాబు సమావేశం.. బ్యాంకర్లకు కీలక సూచనలు

by Vemula.Srinu Prasad |

ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి పై నిర్వహించిన సమావేశంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు...

ఎంఎస్ఎంఈ రంగంపై సీఎం చంద్రబాబు సమావేశం.. బ్యాంకర్లకు కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి సచివాలయం(Amaravati Secratariat)లో 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం(SLBC Meet) జరిగింది. ఈ సమావేశం సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన సాగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్(Ratan Tata Innovation Hubs) ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతు ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్(Union Bank) సపోర్ట్ చేస్తోందని సీఎం చంద్రబాబుకు ఆ బ్యాంక్ ప్రతినిధులు చెప్పారు. రాజమండ్రి స్పోక్ హబ్‌కు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, అనంతపురం స్పోక్ హబ్‌కు కెనరా బ్యాంక్, విశాఖ స్పోక్ హబ్‌కు పీఎన్బీ, తిరుపతి స్పోక్ హబ్‌కు ఇండియన్ బ్యాంక్, విజయవాడ స్పోక్ హబ్‌కు హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సహకారం ఇస్తున్నట్టు ఆయా బ్యాంకర్ల ప్రతినిధులు వివరించారు. దీంతో ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎక్కువ ప్రొత్సహించాలని బ్యాంకర్లకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

భరోసా ఇచ్చేలా ...


‘‘ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇచ్చేలా పాలన ఉండాలి. గత పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయి.. ప్రభుత్వానికి క్రెడిబులిటీ పోయింది. పెద్ద ఎత్తున వడ్డీలకు అప్పులు తెచ్చారు.క్రెడిబులిటీ ఉంటే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చుకోవచ్చు. అందుకే క్రెడిబులిటీకి, బ్రాండింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏపీలో రూ.2 లక్షల కోట్ల మేర రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశాం.. ఇప్పటి వరకు రూ.49 వేలకోట్లు రీ షెడ్యూల్ చేశాం. రుణాల రీ-షెడ్యూల్ వల్ల రూ.1108 కోట్ల మేర ఆదా చేయగలిగాం. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం కోరుతున్నాం. ఎంఎస్ఎంఈలకు, అలాగే వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం కావాలి. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎంఎంస్ఎంఈల ప్రొత్సహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలం. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంతో ముందుకెళ్తున్నాం. సర్వీస్ సెక్టార్ పుంజుకునేందుకు మేం ప్రణాళికలతో వెళ్తున్నాం. పీపీపీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్దంగా ఉంది. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్లను కూడా ఆహ్వానించండి.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story