కడప ప్రజల ఎన్నో ఏళ్ల కల.. ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పిన CM చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-28 14:28:29  IST  )

కడప జిల్లా వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు...

కడప ప్రజల ఎన్నో ఏళ్ల కల.. ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పిన CM చంద్రబాబు
X

దిశ, వెడ్ డెస్క్: కడప జిల్లా వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. ఎన్నో ఏళ్ల కలపై ఆయన సంచలన ప్రకటన చేశారు. పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు(Kadapa Steel Plant works) ప్రారంభిస్తానని, తద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. టూరిజం ప్రాంతంగా గండికోట(Gandikota)ను డెవలప్ మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అక్కడ 100 అడుగుల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెడతామన్నారు. అంతేకాదు రాయలసీమ(Rayalaseema)కు చాలా కంపెనీలు రావాలని ఆకాంక్షించారు. ఏరో స్పెస్ ఇండస్ట్రీస్‌(Aerospace Industries)కు అనంతపురం(Ananthapuram) జిల్లా లేపాక్షి అనువైన ప్రాంతమని ఈ విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లినట్లు కడప మహానాడులో చంద్రబాబు తెలిపారు.

Next Story