- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో డ్రైవర్లు, మహిళలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రటకన
ఆటో డ్రైవర్లు, మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు(Auto Drivers), మహిళల(Womens)కు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) గుడ్ న్యూస్ ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే మహిళలకు అదే రోజు నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పామని, ఈ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు-ఏడాది పాలనపై అమరావతి సెక్రటేరియట్ వెనుక భాగంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని , ధనవంతులు ఇంకా ఇంకా ధనికులుగా మారిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో మనతో పుట్టినవాళ్లు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారన్నారు. అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలని ఆకాక్షించారు. బిల్ గేట్స్ తాను సంపాదించిన దాంట్లో 99 శాతం డబ్బులు సమాజానికే ఇస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పేదలకు ప్రతి ఒక్కరు సాయం చేయాలని, అప్పుడే వాళ్లు కూడా ఆర్థికంగా పైకి వస్తారన్నారు. పేదలను ఆదుకునేందుకే పీ-4ను తీసుకొచ్చామని, ఇందులో ధనికులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులు కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి చాలా రకాల రాయితీలు ఇస్తున్నామని, వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.6 లక్షలుగా ఉందని, 2047కు రూ.55 లక్షలకు పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.






