- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహకరిస్తే సరే... లేదంటే చర్యలే: వైసీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
సహకరిస్తే సరేనని, లేదంటే ఏం చేయాలో చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ..

దిశ, వెబ్ డెస్క్: తాను 1995 సీఎంనని సహకరిస్తే సరేనని, లేదంటే ఏం చేయాలో చేసి చూపిస్తామని వైసీపీ నాయకులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయనగరం జిల్లా దత్తి(Datti)లో సామాజిక పెన్షన్ల పంపిణీ(Distribution of social pensions) చేసిన ఆయన. ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆడ బిడ్డల రక్షణ, శాంతి భద్రతలే తమకు ప్రాధాన్యత అని చెప్పారు. ఎవరికైనా గంజాయి మత్తు ఉంటే మత్తు దింపేస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, వారందరికి ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఉద్యోగులను తమ ప్రభుత్వం బాగా చూసుకుంటుందని, పని చేయకపోతే మాత్రం సహించేది లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






