నెల్లూరు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్... సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక హామీ ఇచ్చారు..

నెల్లూరు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్... సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Ch) గుడ్ న్యూస్ తెలిపారు. నెల్లూరు(Nellore)లో పర్యటించిన ఆయన ఇథనాల్ ప్రాజెక్ట్‌, లైఫ్ స్కూల్, గోశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే రామాయపట్నం(Ramayam Patnam), దుగ్గరాజుపట్నం(Duggarupatnam) రాబోతోందన్నారు. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే నెంబర్-1 అవుతుందని వ్యాఖ్యానించారు. నెల్లూరులో ఏర్పాటైన ఇథనాల్ పరిశ్రమతో రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. నందగోకులంలో పేద పిల్లలకు విద్య అందిస్తున్నారని, పీ-4లో అందరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Next Story