- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన కీలక ప్రటకన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన కీలక ప్రటకన చేశారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, కూటమి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏపీ కేబినెట్(Ap Cabinet) భేటీ ముగిసిన తర్వాత వివిధ విషయాలపై చర్చించారు.
కూటమి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సైతం జనాలకు వివరించాలని చెప్పారు. ప్రజలకు తీర్చిన హామీలను మీడియాకు చెప్పుకోవడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూటమినే గెలిచిందని, స్థానిక ఎన్నికల్లో కూడా విజయం తమదేనని చంద్రబాబు తెలిపారు. నీటి సంఘాలు పంచాయతీలు మాదిరిగా నీటి సంఘాలు నీటి పన్నులు వసూలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడికి చంద్రబాబు సూచించారు.






