- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన గత పాలకులు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గత పాలకులు అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నేతల్లో సీఎం చంద్రబాబు నాయుడు బాంబు పేల్చారు...

దిశ, వెబ్ డెస్క్: గత పాలకులు అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నేతల్లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) బాంబు పేల్చారు. మద్యం కేసు విచారణ మరికొద్ది రోజుల్లో పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దోపిడీ జరిగిన స్థాయిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కేసు విచారణ పారదర్శకంగా జరిగాలనే తాను ఇప్పటివరకూ మాట్లాడలేదని చెప్పారు. వైసీపీ(Ycp) నేతలు చేసిన తప్పుల్ని కూటమి నాయకులపైకి నెడుతున్నారని వ్యాఖ్యానించారు. కూటమి ఎంపీలు(Mps) కేంద్రంలో కీలకంగా ఉన్నారని, వాళ్ల పని తీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలే ఏజెండాగా పార్లమెంట్‌లో ఎంపీలు గట్టిగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రగతిని ఎంపీలందరూ పార్లమెంట్‌లో వివరించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.






