ఆలయంలో ఈఓ చోరీ.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

by Naga Rani Yarlagadda |

ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈఓ చోరీకి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయంలో ఈఓ చోరీ.. సీఎం చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈఓ చోరీకి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో తప్పుడు పనులకు పాల్పడిన వారు ఎవరైనా సరే.. కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో ఆలయ ఈఓ మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మురళీకృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆలయాల సంబంధిత విషయాలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆలయ సంబంధిత విషయాల్లో హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక విశాఖలో త్వరలోనే మోడ్రన్ సైక్లింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరాన్ని పర్యావరణ రహితంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Next Story