ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-14 13:55:01  IST  )

ఏపీ ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా సంక్రాంతి శుభాకాంక్ష‌లు చెప్పారు. త‌న ఎక్స్ పోస్టులో సీఎం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం ‘‘మకర సంక్రాంతి’’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షల‌ని పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా సంక్రాంతి శుభాకాంక్ష‌లు చెప్పారు. త‌న ఎక్స్ పోస్టులో సీఎం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం ‘‘మకర సంక్రాంతి’’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షల‌ని పేర్కొన్నారు. విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ అంద‌రి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. పాడిపంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ, మన సంప్రదాయాలను మరచిపోకుండా పాటించాలని కోరారు.

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందాలని, అందుకు అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే చంద్ర‌బాబు ఈ ఏడాది సంక్రాంతి పండుగ‌ను త‌మ స్వ‌గ్రామం నారావారి ప‌ల్లెలో జ‌రుపుకుంటున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సీఎం నారావారిప‌ల్లెలో సంద‌డి చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో అనేక కార్య‌క్ర‌మాలు, పోటీలు నిర్వ‌హిస్తూ స‌ర‌దాగా గ‌డుపుతున్నారు.

Next Story