- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ, తెలంగాణలో టాప్ ర్యాంకులు: నారా భువనేశ్వరిని అభినందించిన చంద్రబాబు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్‌లో NTR జూనియర్ కాలేజీ విద్యార్థినులు అద్భుతమైన ఫలితాలు సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: 2026 కామన్ లా అడ్మిషన్ టెస్ట్(Common Law Admission Test)లో NTR జూనియర్ కాలేజీ(NTR Junior College) విద్యార్థినులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. వివిధ విభాగాల్లో 103, 129, 164, 179, 264, 574, 652, 699 ఆలిండియా ర్యాంకులు సాధించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘‘ర్యాంకులు సాధించిన విద్యార్థులు సంస్థకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంక్, తెలంగాణలో చాలా టాప్ టెన్ ర్యాంకులు సాధించారు. న్యాయ రంగంలో విద్యార్థులు తదుపరి అడుగులు వేయబోతున్నారు. న్యాయ వ్యవస్థ బలోపేతం, సమగ్రతతో సమాజానికి సేవ చేయాలి. విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పిస్తున్న NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అభినందిస్తున్నా.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.






