- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య చారిత్రక రికార్డ్.. సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్
నటుడు బాలకృష్ణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. సినీ పరిశ్రమ(Cine Industry)లో హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయనను యూకేకు చెందిన సంస్థ వరల్డ్ బుక్ రికార్డు(World Book Record)లోకి ఎక్కించింది. అంతేకాదు గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్(Gold Edition Recognition) అవార్డును ప్రకటించింది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని ప్రశంసించింది. ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగే వేడుకలో ఈ అవార్డును బాలకృష్ణకు అందజేయనుంది.
అయితే నందమూరి బాలకృష్ణకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కడంపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. బాలయ్యకు అభినందనలు తెలిపారు. ‘‘ సినిమా పట్ల బాలకృష్ణకున్న అంకితభావం, మక్కువకు ప్రసిద్ధి చెందినది. బాలకృష్ణ 50 సంవత్సరాల పాటు హీరోగా చేసిన ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK ద్వారా గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం. ఈ చారిత్రాత్మక మైలురాయిపై నిలిచిన బాలయ్యకు అభినందనలు.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.






