పదేళ్లలో పది ఘటనలు.. వైసీపీ కుట్రలను బయటపెట్టిన సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

గత పదేళ్లలో వైసీపీ చేసిన పది కుట్రలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు..

పదేళ్లలో పది ఘటనలు.. వైసీపీ కుట్రలను బయటపెట్టిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పెద్దాపురం(Peddapuram)లో ‘‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’’(Swarnandra-Swachandra) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) బీమా మంజూరు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత పదేళ్లలో జరిగిన 10 సంఘటనలను ఆయన గుర్తు చేశారు. వైసీపీ(Ycp) కుట్ర రాజకీయాలు, జగన్ క్రిమినల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో సీఎం వివరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదని, కానీ బయట ఓ రాజకీయ పార్టీ ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని సమస్యలు చూస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వసనీయత లేని నాయకుడు జగన్ అని వ్యాఖ్యానించారు. తప్పుడు విధానాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు రాజకీయ పార్టీని నడిపే అర్హత లేదన్నారు. సొంత బాబాయిని హత్య చేసి గుండెపోటు అని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. తానే వివేకానందారెడ్డి(Vivekananda Reddy)ని చంపానని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. విశాఖలో కోడి కత్తి డ్రామా ఆడి.. అది కూడా తనపై నెట్టే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

పదేళ్లలో 10 సంఘటనలు ఇవే..

1. వివేకా హత్య కేసు

2. కోడి కత్తి డ్రామా

3. గులకరాయి దాడి

4. డయాఫ్రమ్ వాల్

5. పింఛన్ల నిలిపివేత

6. సింగయ్య మృతి

7. వీడియో మార్ఫింగ్

8. అమరావతి మునిగింది

9. పెట్టుబడులు వద్దంటూ లేఖలు

10. పింఛన్లపై తప్పుడు ప్రచారాలు

Next Story