Breaking: పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్టాంగ్ వార్నింగ్

by srinivas |
Breaking: పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్టాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిన సందర్భం, నామినేషన్ల పదవులు పందేరం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తీరుపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాల నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. ఈ రిపోర్టులో పలువురు ఎమ్మెల్యేలు(Mls), పార్టీ నేతల(Leaders) పని తీరు బాగోలేదని తేలింది. దీంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిపై కూడా కొన్నిచోట్ల వ్యతిరేకత ఉన్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది.

దీంతో పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి(Amaravati)లో అత్యవసర సమావేశం నిర్వహించారు. నామినేటెడ్ పదవుల(Nominated Posts)పై పార్టీ నేతలకు పలు సూచన, సలహాలు చేశారు. పలువురు నేతలు, ఎమ్మెల్యేల పని తీరుపై మండిపడ్డారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని, మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వల్లే పదవులు వచ్చాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని హెచ్చరించారు. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని తేల్చి చెప్పారు. పని తీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed