- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. వైసీపీ కుట్రలకు చెక్ పెట్టేలా నిర్ణయాలు
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల భేటీ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు ఇద్దరూ సమావేశమై అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల భేటీ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు ఇద్దరూ సమావేశమై అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీ రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతోందని, వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ ట్రాప్ లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఇరువురు చర్చించుకున్నారు. టీడీపీ - జనసేన శ్రేణుల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక త్వరలోనే రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీకానుండగా.. వాటిపై, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపైనా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.






