సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు.. ఇదే షెడ్యూల్

by Naga Rani Yarlagadda |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారయింది.

సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు.. ఇదే షెడ్యూల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ 11.30 గంటలకు హోమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమవుతారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్ అనంతరం సీఎం చంద్రబాబు.. ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు.

Next Story