- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రెండ్రోజుల షెడ్యూల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రేపు ఢిల్లీకి పయనమవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రేపు ఢిల్లీకి పయనమవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, సి.ఆర్.పాటిల్ లను కలవనున్నారు. నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ సమావేశమవుతారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.
బుధవారం కేంద్రకార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశమవ్వనున్నారు. ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయి రాష్ట్రానికి రావలసిన నిధులపై చర్చించనున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరవ్వనున్నారు. 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి అమరావతికి రానున్నారు.






