- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని పనుల్లో జాప్యం... కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్
రాజధాని అమరావతిని నిర్మించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే కాంట్రాక్ట్ సంస్థలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ..

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)ని నిర్మించేందుకు ప్రభుత్వం(Government) తీవ్రంగా కృషి చేస్తుంటే కాంట్రాక్ట్ సంస్థలు(Contract organizations) మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నాయి. దీంతో పనులు నత్తనకడన నడుస్తున్నాయి.ఇటీవల రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదాలు జరిగి నిర్మాణ సామగ్రి దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే వీటిని రక్షించుకోవాల్సిన కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వహించాయనే విమర్శలు వెల్లువెత్తాయి.
చంద్రబాబు అసహనం
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థల తీరును తప్పుబట్టారు. ఘటన జరిగిన తర్వాత సైతం కాంట్రాక్టు సంస్థలు, అధికారులు సరిగా స్పందించలేదని మండిపడ్డారు. మరోవైప ప్రతి అంశాన్నీ వక్రీకరించేలా కొందరు రాజకీయాలు చేస్తుండటంపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి కదా? అని నిలదీశారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే అలర్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అని ప్రశ్నించారు ఇలా నిర్లక్ష్యంగా వ్యవరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేందిలేదని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికే అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏ మాత్రం జాప్యం జరిగిన ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు.
రాజధాని అమరావతి పనులకు...
అలాగే రాజధాని అమరావతి పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలోనూ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ కొరత వల్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దన్నారు. నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక, గ్రావెల్‌ను గ్రీన్ ఛానెల్ ద్వారా తీసుకు వెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.






