- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్యను అభినందించిన సీఎం.. మరిన్ని సాధించాలని ట్వీట్
రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు తీసుకున్న బాలయ్యను సీఎం చంద్రబాబు అభినందించారు..

దిశ, వెబ్ డెస్క్: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు పద్మభూషణ్(Padma Bhushan) వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. దీంతో ఆయనపై సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు పెడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.






