బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్.. షట్లర్ సూర్య చరిష్మకు సీఎం అభినందనలు

by Naga Rani Yarlagadda |

సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన..

బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్.. షట్లర్ సూర్య చరిష్మకు సీఎం అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జట్టు ఫస్ట్ టైమ్ సిల్వర్ మెడల్ సాధించింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ విభాగంలో షట్లర్ సూర్య చరిష్మ తారిణి గోల్డ్ మెడల్ సాధించగా.. ఆమెను సీఎం అభినందించారు. ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారిణుల ప్రతిభకు ఇది ఒక నిదర్శనమని, భవిష్యత్తులో సూర్య చరిష్మ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు తమ విజయాలతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతున్నారని కొనియాడారు.

Next Story