- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారా భువనేశ్వరిని అభినందించిన సీఎం చంద్రబాబు.. కారణం ఇదే!
28 ఏళ్ల క్రితం స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) కోట్లాది మందిని ఆదుకుంటుందని ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్‌డెస్క్: 28 ఏళ్ల క్రితం స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) కోట్లాది మందిని ఆదుకుంటుందని ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాలు(Natural disasters) సంభవించినప్పుడు బాధితులను ఈ ట్రస్ట్ ఆదుకుందని తెలిపారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విజయవాడ(Vijayawada) కేంద్రంగా తన సేవలను మరింత వ్యాపింపజేయనుంది. ఈ క్రమంలో ఇవాళ(గురువారం) విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari), ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ క్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ట్రస్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇది మరో మైలురాయి అని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు, అభాగ్యులకు సాయం అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ నేడు విజయవాడలో సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నందున నారా భువనేశ్వరిని, ట్రస్ట్ యజమాన్యం, దాతలను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలను ఈ ట్రస్ట్ నిలబెట్టిందని తెలిపారు. అలాగే సేవా కార్యక్రమాలు చేసేవారికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. తలసేమియా బాధిత పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుందని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






