- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Swachh Survekshan Awards: ఆ కమిషనర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన ఐదు నగరాల కమిషనర్లకు సీఎం చంద్రబాబు అభినందించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రికి స్వచ్ఛ సర్వేక్షణ్(SWACHH SURVEKSHAN) అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నగరాలకు అవార్డులు రావడానికి కారణమైన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. ‘
‘2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో AP మెరిసే పని తీరు కనబరిచింది. ఇందుకు కారణమైన మున్సిపల్ శాఖ, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, పారిశుధ్య కార్మికులు, పౌరులకు అభినందనలు. విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రతిష్టాత్మక సూపర్ స్వచ్ఛ లీగ్‌లో చేరాయి. విశాఖపట్నం (GVMC) మినిస్టీరియల్ అవార్డు (స్పెషల్ కేటగిరీ) గెలుచుకుంది. రాజమండ్రి మినిస్టీరియల్ అవార్డు (రాష్ట్ర స్థాయి) అందుకుంది. రాష్ట్ర ప్రజల సమిష్టి కృషి వల్ల ఈ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర మిషన్ ప్రభావాన్ని మరింత హైలైట్ చేస్తాయి.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.






