- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతి పునర్నిర్మాణం: ‘టార్గెట్’ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి 'ఫ్యూచర్ సిటీ'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మాణ పనులపై కీలక సమీక్ష నిర్వహించారు..

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)ని ప్రపంచస్థాయి 'ఫ్యూచర్ సిటీ'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minsiter Chandrababu Naidu) నిర్మాణ పనులపై కీలక సమీక్ష నిర్వహించారు. సుమారు రూ. 57,821 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల పురోగతిని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పనుల్లో వేగం పెంచాలని, వారం, నెలవారీ లక్ష్యాలను (Targets) నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిని కేవలం కాంక్రీట్ కట్టడంగా కాకుండా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
యుద్ధ ప్రాతిపదికన..
గతంలో నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని, క్షేత్రస్థాయిలో మార్పు స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని, ప్రతి ఇటుకలోనూ నాణ్యత ఉట్టిపడాలని ఆయన అధికారులకు సూచించారు. "పేపర్ మీద ఉన్న ఫ్యూచర్ సిటీ విజన్‌ను నేల మీద సాకారం చేసి చూపించాలి" అని పిలుపునిస్తూ, ఎక్కడా జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని, నిర్ణీత సమయంలోగా ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.






