రాష్ట్రానికి మరో 20 పోర్టులు : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రానికి మరో 20 పోర్టులు రాబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు.

రాష్ట్రానికి మరో 20 పోర్టులు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి మరో 20 పోర్టులు రాబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శనివారం మంగళగిరి వేదికగా నిర్వహించిన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నదులు, కాలువలు పుష్కలంగా ఉన్నాయని, మరిన్ని డ్రై పోర్టులు (Dry Ports) వస్తాయని తెలిపారు. అలాగే ప్రపంచస్థాయి లాజిస్టిక్ హబ్‌లను తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఇచ్చిన అండదండలను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. పొలంలోనే గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేయాలని గడ్కరీ ఎప్పుడూ చెబుతుంటారని, ఆయన హయాంలోనే సాగర్ మాలా, భారత్ మాలా వచ్చాయని కొనియాడారు. అమరావతిలో 189 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించాలని అడిగానని.. విశాఖ, విజయవాడకు మెట్రో ఇవ్వాలని కూడా కోరానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేంద్రం చూపిన చొరవతో.. ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ ఏపీదే అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story