Mla ప్రసాద్‌‌కు సీఎం చంద్రబాబు క్లాస్

by Vemula.Srinu Prasad |

జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ కు ఎమ్మెల్యే ప్రసాద్ కు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు..

Mla ప్రసాద్‌‌కు సీఎం చంద్రబాబు క్లాస్
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) నటించిన ‘వార్-2’ సినిమా(War-2 Movie) విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ మూవీ విడుదల తర్వాత అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్(Anantapur Rural MLA Dagguppati Prasad) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. వార్-2లో ఎన్టీఆర్ నటించారని, నియోజకవర్గం టీడీపీ(Tdp) నేతలు, కార్యకర్తలు చూడొద్దంటూ పిలుపు నిచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్‌పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

దీంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానం దృష్టికి చేరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే ప్రసాద్‌కు క్లాస్ తీసుకున్నారు. పరిణితితో వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌పై ఉద్దేశపూర్వంగా వ్యాఖ్యలు చేయలేదని సీఎంకు ప్రసాద్ వివరించారు. నియోజకవర్గంలో అందరితో సమన్వయం చేసుకోవాలని ప్రసాద్‌ను చంద్రబాబు ఆదేశించారు.

Next Story