- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతకు సీఎం చంద్రబాబు ఆఫర్.. ముందుకొస్తే తీర్చిదిద్దుతామని హామీ
సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ యువతకు మంచి ఆఫరిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ యువతకు మంచి ఆఫరిచ్చారు. మంచి ఆలోచనలతో ముందుకు వస్తే.. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన MSME పార్కును ఆయన ప్రారంభించారు. 17 జిల్లాల్లో రూ.873 కోట్ల ఖర్చుతో 868 ఎకరాల్లో డెవలప్ చేసిన 49 MSME పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాల కల్పన చేపడుతామని ప్రకటించారు.
వెల్లువలా పెట్టుబడులు
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 99 కంపెనీలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని, వీటి ద్వారా 2 లక్షల మంది ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. నవంబర్ 14,15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ ఇంటర్న్ షిప్ సదస్సులో రూ.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని స్పష్టం చేశారు.






