- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu: వీరయ్య చౌదరి అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో దుండగుల దాడిలో హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్యచౌదరి అంత్యక్రియల్లో సీఎం చద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొననున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో దుండగుల దాడిలో హత్యకు గురైన టీడీపీ నేత (TDP Leader) ముప్పవరపు వీరయ్యచౌదరి (Veerayya Choudary) అంత్యక్రియల్లో సీఎం చద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొననున్నారు.ఈ సాయంత్రం 3 గంటలకు ఆయన అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకుంటారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని వీరయ్యచౌదరి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నిన్న ఒంగోలులోని (Ongole) తన కార్యాలయంలో వీరయ్యచౌదరిపై దాడి జరిగిన విషయం తెలిసిందే ముసుగులో వచ్చిన కొందరు దుండగులు వీరయ్యచౌదరిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. హోంమంత్రి అనిత అర్ధరాత్రి ఘటనా స్థలానిన పరిశీలించారు. ప్రస్తుతం వీరయ్య మృతదేహం ఒంగోలు రిమ్స్‌లో ఉంది. పోస్టు మార్టం అనంతరం ఆయన భౌతికకాయాన్ని అమ్మనబ్రోలు గ్రామానికి తరలిస్తారు. సీఎం ఆ గ్రామానికి వెళతారు. వీరయ్యను నలుగురు కత్తితో పొడిచారు. నిందితులను పట్టుకునేందుకు దాదాపు 12 బృందాలు గాలిస్తున్నాయి. టీడీపీ నేత హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి






