- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయ చేసి అనవసర ప్రయాణాలు వద్దు: మహిళలకు సీఎం రిక్వెస్ట్
అనవసరమైన ప్రయాణాలు చేయొద్దని మహిళలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు....

దిశ, వెబ్ డెస్క్: అనవసరమైన ప్రయాణాలు చేయొద్దని మహిళలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా దత్తిలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫ్రీ బస్సు జర్నీ స్కీంపై మాట్లాడారు. పండగ సందర్భంగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి టెంపుల్స్ దర్శించుకోవచ్చని తెలిపారు. అలా చేయడం వల్ల రెండు పనులు అవుతాయన్నారు. దేవుడిని దర్శించుకుని అక్కడ పార్థనలు చేస్తే కోరుకలు తీరతాయని, కష్టపడి పని చేస్తారన్నారు. కానీ అనవసరంగా ప్రయాణం చేస్తే ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పారు. అవసరానికి ఫ్రీ బస్సును వినియోగించుకోవాలని సూచించారు. ఫ్రీబస్సు పథకం సూపర్ హిట్టు అయినందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






