ప్రతి రోజు అరకు కాఫీ తాగండి: కేంద్రమంత్రులకు చంద్రబాబు రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

ప్రతి రోజు అరకు కాఫీ తాగండని కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు....

ప్రతి రోజు అరకు కాఫీ తాగండి: కేంద్రమంత్రులకు చంద్రబాబు రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి చెందిన అరకు కాఫీ(Araku Coffee)కి ప్రపంచ గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కాఫీ ఉత్పత్తుల ద్వారా అధిక లాభాలు రాబట్టేందుకు ఏపీ ప్రభుత్వం(Ap Governemrnt) తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాల్లోనూ ప్రచారం చేస్తోంది. ఎగుమతులు సైతం చేస్తోంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీ( Delhi)లోనూ అరకు కాఫీకి ప్రాధాన్యం పెంచేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పార్లమెంట్ భవనం(Parliament Bhavan) వద్ద అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం అరకు కాఫీపై ఢిల్లీలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు హస్తినకు వెళ్లిన ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. అరకు కాఫీని ప్రతి రోజూ తాగాలని వారికి సూచించారు. తద్వారా ఆదాయం వస్తుందని, కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహించినట్లవుతుందని వారికి తెలిపారు. కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, రాజ్‌నాథ్‌, సీఆర్‌పాటిల్‌, జితేంద్రసింగ్‌కి అరకు కాఫీ బాక్సులను సీఎం చంద్రబాబు ఇచ్చారు.


కాగా ఏపీ(Ap)కి రావాల్సిన నిధులు విడుదలే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Central Minister Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు. శనివారం కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది.

Next Story