- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఉదారతతో సాయం చేయండి.. కీలక పాత్ర పోషిస్తాం: సీఎం చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ ఉదారతతో రాష్ట్రానికి సాయం చేస్తే రేపు దేశం సాధించే విజయాలలో కీలక పాత్ర పోషిస్తామని 16వ ఆర్థిక సంఘానికి(Economic Community) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌నూ 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. దీంతో పాటు అమరావతి అభివృద్ధి, నీటి పారుదల శాఖపైనా ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన జరగలేదని తెలిపారు. తద్వారా ఇబ్బందికర పరిస్థితి ఉందని వివరించారు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధిని వివరించారు. మంచి నీటి సౌకర్య కోసం జల్ జీవన్ మిషన్ పథకం బాగా పని చేస్తోందని తెలిపారు. దేశాభివృద్ధిలో పంచాయతీలా అభివృద్ధి చాలా ముఖ్యమని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం ఉదారతో రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
16వ ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ అరవింద్ పనగారియా గారు మరియు సంఘ సభ్యులతో సచివాలయంలో నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan, ఇతర మంత్రులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.#AndhraPradesh #16thFinanceCommission pic.twitter.com/mgcz6FQXp2
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) April 16, 2025