- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ.. సరిహద్దు సమస్యలపై చర్చ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి సరిహద్దు సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో భేటీ అయి చర్చిస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పునర్ వ్యవస్థీకరణ(AP Reorganization) జరిగి 12 ఏళ్లు అవుతోన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ(Telangana), ఏపీ(Ap) సరిహద్దు సమస్యలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. గత పదేళ్లలో సరిహద్దులు విషయంలో ప్రతిసారి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో సమస్య పరిష్కారం జఠిలంగా మారింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సానుకూలం వాతావరణం నెలకొంది. విభజన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతోంది. నీటి విషయం కోర్టుల్లోనూ, ట్రైబునల్‌లో వాదనలు వినిపిస్తుండగా కొన్ని సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం చూపేందుకు సుముఖంగా వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ...
తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా(Kammam District)లో ఉమ్మడి సరిహద్దు(common boundary) సమస్యను పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) చొరవ చూపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu)ను అమరావతి ఉండవల్లిలో కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు సమస్యపై చర్చిస్తున్నారు. ఐదు గ్రామ పంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వే లైన్లు, హైవేల పనులపైనా చర్చించారు. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు.






