పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-26 08:05:29  IST  )

క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. చాగల్లులో జరిగే క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు మంగళవారం ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు రాజమండ్రి దివాన్ చెరువు - కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని నిన్న(మంగళవారం) గుర్తించారు.

హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఆయన మాట్లాడారు.

పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం పై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదం గా గుర్తించారు. ఆయన మృతిపై వివిధ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం" అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story