ఐఎఎస్ అధికారి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్ర‌బాబు దంప‌తులు ఐఏఎస్ అధికారి వివాహానికి హాజ‌ర‌య్యారు. కుప్పం ఏరియా డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్ట‌ర్, ఐఏస్ అధికారి వికాస్ మ‌ర్మ‌త్ వివాహం జైపూర్ లోని వృందావ‌న్ లో జ‌ర‌గ్గా సీఎం స‌తీస‌మేతంగా హాజ‌ర‌య్యారు.

ఐఎఎస్ అధికారి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్ర‌బాబు దంప‌తులు ఐఏఎస్ అధికారి వివాహానికి హాజ‌ర‌య్యారు. కుప్పం ఏరియా డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్ట‌ర్, ఐఏస్ అధికారి వికాస్ మ‌ర్మ‌త్ వివాహం జైపూర్ లోని వృందావ‌న్ లో జ‌ర‌గ్గా సీఎం స‌తీస‌మేతంగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం దంప‌తులు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. గురువారం ఉద‌యం చంద్ర‌బాబు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుండి జైపూర్ చేరుకున్నారు. నిన్న వేడుక‌కు హాజ‌రై రాత్రి జైపూర్‌లోనే బ‌స చేశారు. ఇక నేడు సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి, యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ మార్గం సుగ‌మం చేసేలా ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో చంద్ర‌బాబు ఎంఓయూలు చేసుకోనున్నారు.

Next Story