రాష్ట్రంలో వరుసగా నేరాలు.. ఎంపీలకు అప్రమత్తత ప్రకటించిన చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు...

రాష్ట్రంలో వరుసగా నేరాలు.. ఎంపీలకు అప్రమత్తత ప్రకటించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎంపీల(Tdp Mps)కు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) సూచించారు. ఢిల్లీ ప్రధాని భేటీ అనంతరం వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వివేకా హత్య(Viveka Murder) తరహాలోనే నకిలీ మద్యం(Fake Liquor) ఘటన ఉందని చెప్పారు. వివేకా హత్యలాగే రాష్ట్రంలో మళ్లీ అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. క్రిమినల్ మాస్టర్ మెండ్ ఎలా ఉంటుందో జగనే ఉదాహరణ అని తెలిపారు. మూర్కుడు, క్రూరుడు అనే పదాలు జగన్, అతని అనుచరుకే వర్తిస్తాయని మండిపడ్డారు. నేరాలు చేసి తెలుగుదేశం పార్టీపై నెట్టడం జగన్‌కు పరిపాటిగా మారిందని విమర్శించారు. నేర కార్యకలాపాలకు పెట్టింది పేరుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నట్లు సమాచారం ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు

Next Story